మన ప్రగతి న్యూస్/ఏన్కూర్
ఏన్కూర్ మండలంలో పండుగ నేపథ్యంలో ఎస్ఐ సంధ్య ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం వాహనాల తనిఖీలు, మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారిపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. రోడ్లపై వాహనాలను ఆపి మద్యం సేవించి వాహనం నడుపుతున్నారా లేదా అన్నదాన్ని పోలీసులు పరిశీలించారు.ఈ సందర్భంగా ఎస్ఐ సంధ్య మాట్లాడుతూ, మద్యం తాగి వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం అధికంగా ఉంటుందని తెలిపారు. అలాంటి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పండుగల ఆనందంలో నిర్లక్ష్యం చేయకుండా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.ప్రజల ప్రాణాల భద్రతే లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించి బాధ్యతగా ప్రవర్తించాలని ఎస్ఐ సంధ్య అన్నారు

