ఎస్సై పవన్ కుమార్
మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:
క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తూ,మానసిక ఉల్లసాని కలిగిస్తాయని ఎస్సై దూల పవన్ కుమార్ అన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో వడ్లకొండ హర్షవర్ధన్ రెడ్డి స్మారకార్థం వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు
కలిసి గ్రామస్థాయి కబడ్డీ క్రీడోత్సవాలను నిర్వహించారు.ఈ క్రీడలలో స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని కబడ్డీ క్రీడల్లో గెలుపొందిన విజేతలకు ప్రథమ బహుమతి భవాని యూత్ గూడూరు5016 రూపాయలు,రెండవ బహుమతి,గోపాలపురం 3016 బహుమతులను అందజేశారు. సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లసాని కలిగిస్తాయని తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతోపాటు క్రీడలో రాణించే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాచర్ల స్వరూప పుల్లయ్య,హర్షవర్ధన్ తల్లిదండ్రులు విజయ వెంకట్ రెడ్డి,ఉప సర్పంచ్ గుగ్గిళ్ళ కళ్యాణ్, వార్డు మెంబర్లు బోరెడ్డి మల్లారెడ్డి, గుగ్గిళ్ళ ప్రేమ్ కుమార్ భాష బోయిన రవి, మాజీ సర్పంచ్ మాచర్ల పుల్లయ్య, క్రీడల నిర్వాహకులు బసిరెడ్డి అజిత్, చింతల రఘువరన్ , వడ్లకొండ తేజ, మడత రవీంద్రుడు తదితరులు పాల్గొన్నారు.

