మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:
చేనేత కార్మికులు నేసిన ఉత్పత్తులను పలు మెలకువలతో అమ్మకాలను పెంచి, కార్మికులకు తిరిగి పని కల్పిస్తూనే ఉండాలని కాంగ్రెస్ నేత, చేనేత నాయకుడు త డక వెంకటేష్ అన్నారు. స్థానిక చేనేత సిల్క్ చీరల ఉత్పత్తిదారుల సంఘం 48వ వార్షికోత్సవ మహాసభ సోమవారం నాడు జరిగింది.సంఘ భవనంలో సంఘ అ ధ్యక్షుడైన భారత లవ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సభలో వెంకటేష్ పాల్గొని ప్రసంగిస్తూ మార్కెట్లో పోటీకి అనుగుణంగా, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించు కుంటూ, నాణ్యమైన ఉత్పత్తులను నేపిస్తూ, పలు మెలకువలతో విక్రయాలు అ య్యేలా చేస్తూ, కార్మికులకు పని కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నా రు. దీంతోపాటు సంఘాన్ని బలోపేతం చేస్తూ ముందుకెళ్లాలన్నారు. ఈ సందర్భం గా సంఘ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.ఈ సభలో అర్బన్ బ్యాంక్ చైర్మన్ తడక రమేష్, శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ సీత సత్యనారాయణ తో పాటు మాజీ ఎంపీపీ బడుగు దానయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ విజయల క్ష్మి శ్రీనివాస్, పద్మశాలి మహా జన సంఘం ఉపాధ్యక్షుడు మురళి ,బిజెపి నేత ధ నుంజయ కార్మిక సంఘం అధ్యక్షుడు పాండు, చేనేత సహకార సంఘం మాజీ అ ధ్యక్షుడు వాసుదేవ్, మద్దెలమ్మ దేవాలయం చైర్మన్ రాము, ఇంకా కే.బాలరాజ్ ,పి. సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు. ఈ సభకు సంఘ సభ్యులు హాజరయ్యారు.

