- -కలెక్టర్ హనుమంత రావు
-గ్రామాలలో సుపరిపాలన అందించాలి
మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:
ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గ్రామాలకు ఎన్నికైన నూతన సర్పం చులు ఇక్కడ ఇవ్వబడుచున్న శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ,భూదాన్ పో చంపల్లి మండలంలో గల స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ లో నూతన స ర్పంచులకు నిర్వహించ తలపెట్టిన శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం నాడు కలెక్టర్ ఆ సంస్థ చైర్మన్ కిషోర్ రెడ్డి తో కలిసి జ్యోతి ప్రజలన చేసి ప్రారంభించారు. ఈ సం దర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలో ప్రజలు మీ మీద ఏ నమ్మకం, విశ్వా సంతో గెలిపించారో ఆ నమ్మకాన్ని -విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ప్రజల ఆదరా భిమానాలు చురగొనేలా గ్రామ అభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి కృషి చేయాలని కలె క్టర్ ఈ సందర్భంగా నూతన సర్పంచులకు సూచించారు. దీనికి తోడు ఇక్కడ ఇ వ్వబడుతున్న శిక్షణను సద్వినియోగం చేసుకొని ,గ్రామాలలో సుపరిపాలన అం దించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీ వో ఆర్.భాస్కర్ తో పాటు ట్రైనర్లు, తదితరులు పాల్గొన్నారు.

