Breaking News

చికిత్స పొందుతూ యువకుడు మృతి

మన ప్రగతి న్యూస్/ హనుమకొండ జిల్లా ప్రతినిధి:


దామెర మండలంలోని ఒగ్లాపూర్ స్టేజ్ వద్ద బైక్ అదుపుతప్పి పడిపోయిన ఘటనలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడని ఎస్సై కొంక అశోక్ సోమవారం తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం నల్లబెల్లి మండలం బొల్లోనిపల్లె గ్రామానికి చెందిన గాదె హరిప్రసాద్ S/o రాజమల్లు (లేట్ ) అను వ్యక్తి నిన్న 18వ తేదీన ద్విచక్రవాహనంపై పనిమీద హన్మకొండ కి వెళ్తుండగా ఒగ్లాపూర్ స్టేజ్ వద్దకి రాగానే బైక్ అదుపుతప్పి పడిపోగా కిందపడటం తో తలకి గాయం అయ్యి ఎన్.ఎస్.ఆర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందగా మృతుడి తల్లి అయిన గాదె శ్రీలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కొంక అశోక్ తెలిపారు.

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు