మనప్రగతి న్యూస్ /జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
జోగులాంబ గద్వాల జిల్లాలోని జాతీయ రోడ్డు భద్రతాపై మాసోత్సవ 2026లో భాగంగా
రోడ్డు భద్రత మన అందరి బాధ్యత” అనే సందేశంతో
కేటిదొడ్డి మండల కేంద్రంలోని పోలీస్ సిబ్బందితో కలిసిరోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన కేటిదొడ్డి ఎస్ఐ పగడాల శ్రీనివాసరావు మాట్లాడుతూ
ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు ప్రధానంగా బ్లాక్ స్పాట్ అవగాహన, కారు సీట్ బెల్టుల వినియోగం, వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ వినియోగం నివారణ, మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్ రూట్ డ్రైవింగ్, రెడ్ సిగ్నల్ జంపింగ్, ఆటో పైలటింగ్, మైనర్ డ్రైవింగ్, అతి వేగం మరియు ట్రిపుల్ రైడింగ్ మరియు అలాగే వీటికి సంబంధించిన చట్టపరమైన శిక్షలుపై విస్తృతంగా అవగాహన కల్పించబడింది. అన్నారు రోడ్డు ప్రమాదాలను నివారించి విలువైన మానవ ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించి, సురక్షిత డ్రైవింగ్ అలవాట్లను అవలంబించాలని ఎస్సై పగడాల శ్రీనివాసరావు ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో యువత, స్థానిక పెద్దలు, ఆటో డ్రైవర్లు, ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులు మరియు పాదచారులు పాల్గొన్నారు.


