Breaking News

జీవితం పై విరక్తి చెంది వ్యక్తి మృతి.

మన ప్రగతి న్యూస్/కేసముద్రం:

కేసముద్రం స్టేషన్ పరిధిలోని సంగ సతీష్ (తండ్రి)నర్సయ్య, 40 సం.(మేర)వికలాంగుడు, ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగం గురించి ప్రయత్నిస్తున్నాడు.తనకి మంచి జాబ్ లేక,అతను వికలాంగుడు కావడం తో తనకి పెళ్ళి సంబంధాలు రావడం లేదు అని పెళ్లి కావడం లేదు అని కొన్ని రోజులు గా బాధపడుతూ జీవితం పై విరక్తి చెంది శనివారం తన ఇంటి వెనుకాల గడ్డి మందు త్రాగి వాంతులు చేసుకోనుచుండగా అది గమనించి అతని తండ్రి నర్సయ్యా వెంటనే మహాబాద్ లోని పొనుగోటి ప్రైవేటు హాస్పిటల్ లో చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి 10 గంటలకు చనిపోయినాడు అనీ అతని తండ్రి నర్సయ్యా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినది అని స్థానిక ఎస్సై క్రాంతి కిరణ్ ఈ సందర్భంగా తెలిపారు.

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు