Breaking News

తాటి చెట్టు నుండి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు

.మెరుగైన వైద్యం కోసం నల్లగొండ ఆసుపత్రికి తరలింపు

మన ప్రగతి న్యూస్/రామన్నపేట:

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు

మండలంలోని కొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన వీరమల్ల శంకరయ్య తండ్రి పాపయ్య వృత్తిలో భాగంగా తాటి చెట్టు ఎక్కుతుండగా మధ్యలో కాలు జారీ కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న చుట్టుపక్కల వారు హుటాహుటిన రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా తీవ్ర గాయాలు అయినందున మెరుగైన చికిత్స నిమిత్తం నల్లగొండ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని తెలిపారు.కానీ ఇంటికి పెద్ద దిక్కు అయిన గీత కార్మికుడు,రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం రోడ్డున పడింది.వీరి కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.