Breaking News

మున్సిపల్ ఎన్నికలలో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి

-బిఎస్పీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్

మన ప్రగతి న్యూస్/ కరీంనగర్ జిల్లా ప్రతినిధి:

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు

కరీంనగర్ బిఎస్పీ పార్టీ కార్యాలయంలో కరీంనగర్ అసెంబ్లీ అధ్యక్షులు ఊళ్లేందుల మహేష్ ఆధ్వర్యంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా జిల్లా ఇంచార్జ్ అక్కి బాలకిషన్ మరియు జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఊళ్ళేందుల మహేష్ మాట్లాడుతూ రానున్న కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ అభ్యర్థులను అన్ని డివిజన్ లలో పోటీ చేయించడానికి నిర్ణయించినట్టు వారు పేర్కొన్నారు.అదేవిదంగా కరీంనగర్ మున్సిపల్ ఎన్నికలలో పార్టీ జెండాను ఎగురవేస్తామని వారు తెలిపారు.
జిల్లా ఇంచార్జ్ అక్కి బాలకిషన్ మాట్లాడుతూ కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల పరిధిలో వున్న ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీ అగ్ర వర్ణ పేదలలో ఉన్న బహుజన సమాజం మొత్తం బహుజన్ సమాజ్ పార్టీ వెంట ఉండాలని వారు తెలిపారు.రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అబద్దపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు.జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి కూడా ప్రజలను మోసం చేస్తూ మత తత్వ చిచ్చు పెట్టి ప్రజలను రెచ్చగొడుతుందన్నారు. అదేవిదంగా స్మార్ట్ సిటీ పేరు మీద బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు దొంగ నాటకాలు ఆడుతున్నాయని అన్నారు.కావున రానున్న మున్సిపల్ ఎన్నికలలో బిఎస్పీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిఎస్పీ జిల్లా ప్రధానకార్యదర్శి మాంకాళి తిరుపతి, ఉల్లేందుల అరుణ్ కుమార్,మచ్చ సంపత్, మునుగురి నివాస్,కనకం రఘు,సంతోష్, అరెల్లి రాజు,కత్తి సాయి,ముత్తగళ్ల సాయిరాం,బివిఎఫ్ ప్రభాకర్,మ్యాక సాయి తదితరులు పాల్గొన్నారు.మున్సిపల్ ఎన్నికలలో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి-బిఎస్పీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్(మన ప్రగతి న్యూస్ కరీంనగర్ జిల్లా ప్రతినిధి) కరీంనగర్ బిఎస్పీ పార్టీ కార్యాలయంలో కరీంనగర్ అసెంబ్లీ అధ్యక్షులు ఊళ్లేందుల మహేష్ ఆధ్వర్యంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా జిల్లా ఇంచార్జ్ అక్కి బాలకిషన్ మరియు జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఊళ్ళేందుల మహేష్ మాట్లాడుతూ రానున్న కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ అభ్యర్థులను అన్ని డివిజన్ లలో పోటీ చేయించడానికి నిర్ణయించినట్టు వారు పేర్కొన్నారు.అదేవిదంగా కరీంనగర్ మున్సిపల్ ఎన్నికలలో పార్టీ జెండాను ఎగురవేస్తామని వారు తెలిపారు.జిల్లా ఇంచార్జ్ అక్కి బాలకిషన్ మాట్లాడుతూ కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల పరిధిలో వున్న ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీ అగ్ర వర్ణ పేదలలో ఉన్న బహుజన సమాజం మొత్తం బహుజన్ సమాజ్ పార్టీ వెంట ఉండాలని వారు తెలిపారు.రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అబద్దపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు.జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి కూడా ప్రజలను మోసం చేస్తూ మత తత్వ చిచ్చు పెట్టి ప్రజలను రెచ్చగొడుతుందన్నారు. అదేవిదంగా స్మార్ట్ సిటీ పేరు మీద బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు దొంగ నాటకాలు ఆడుతున్నాయని అన్నారు.కావున రానున్న మున్సిపల్ ఎన్నికలలో బిఎస్పీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిఎస్పీ జిల్లా ప్రధానకార్యదర్శి మాంకాళి తిరుపతి, ఉల్లేందుల అరుణ్ కుమార్,మచ్చ సంపత్, మునుగురి నివాస్,కనకం రఘు,సంతోష్, అరెల్లి రాజు,కత్తి సాయి,ముత్తగళ్ల సాయిరాం,బివిఎఫ్ ప్రభాకర్,మ్యాక సాయి తదితరులు పాల్గొన్నారు.