మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్
సౌత్ ఇండియా సినీ ప్రపంచంలో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పేరు తెలియని వారు ఉండరు. హీరోగా ఎన్నో హిట్లు సాధించి హీరోగా తన స్టామినాను యావత్ సినీ ప్రపంచానికి పరిచయం చేసిన అర్జున్ సర్జ.
నిజ జీవితంలోనూ, ఆధ్యాత్మికంగా సామాజిక పరంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. అటువంటి వ్యక్తినీ ఎంజీఆర్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ తో ఆదివారం సన్మానించింది. ఈ కార్యక్రమంలో ఎంతోమంది ప్రొఫెసర్స్ అర్జున్ ని ఘనంగా సన్మానించారు.