Breaking News

భూదాన్ లో ఘనంగా శ్రీ మార్కండేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

-వైభవంగా స్వామి డోలా రోహణం

  • -లక్ష పుష్పార్చన

మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:

వేములవాడలో పోలీస్ కానిస్టేబుల్‌పై దాడి

యాదాద్రి భువనగిరి జిల్లా, భూదాన్ పోచంపల్లిలో బుధవారం నాడు శ్రీ మార్కం డేశ్వర స్వామి బ్ర హ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమైనాయి. స్వామి సుప్రభాత సే వ- పంచామృత స్నానము, షోడశోపచారా- అష్టోత్తర శతనామావళి పూజతో ఆ లయ కమిటీ చే ఉత్సవాలు మొదలయ్యాయి. స్వామి జన్మ దినం పురస్కరించు కొని ప్రత్యేకంగా అలంకరింపజేసిన ఊయలలో స్వామికి డోలారోహణం నిర్వహిం చారు .వేద పండితులు జోల పాటలు పాడారు. అనంతరం స్వామికి లక్ష పుష్పా ర్చన చేశారు. బుధవారం ప్రారంభమైన ఈ పవిత్ర ఉత్సవాలు శుక్రవారం వరకు పద్మశాలి మహా జన సంఘం సహకారంతో జరగనున్నాయి. దేవాలయ49 వ బ్ర హ్మోత్సవాలు పద్మ బ్రాహ్మణ పురోహిత సంఘం వారిచే నిర్వహించబడను న్నా యి. ఈ ప్రారంభ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సీత సత్యనారాయణ, ఉపాధ్య క్షుడు భారత ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి అంకం యాదగిరి, సహాయ కార్య దర్శి గుర్రం కృష్ణ ,కోశాధికారి ఇంజమూరీ యాదగిరి తోపాటు ధర్మకర్తలు, భక్తజను లు అధికంగా పాల్గొన్నారు.