Breaking News

జాతీయ ఓటర్ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి

-జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

మన ప్రగతి న్యూస్/ కరీంనగర్ జిల్లా స్థాపర్:

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఎదుట టీడబ్ల్యూజేఎఫ్ ధర్నా

జాతీయ ఓటర్ దినోత్సవం విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. ఈనెల 25న నిర్వహించనున్న జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకల నిర్వహణపై కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ ఓటర్ దినోత్సవం పురస్కరించుకొని బూత్ స్థాయి పోలింగ్ అధికారులు నూతన ఓటర్లకు ఓటర్ కార్డుల పంపిణీ,వృద్ధ ఓటర్లకు సన్మానం వంటి కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.గ్రామం,వార్డు స్థాయిలో ఓటరు ప్రతిజ్ఞ చేయాలని అన్నారు.25న కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించే జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు.ఓటు హక్కు,ఓటు ప్రాధాన్యత, ఆవశ్యకతపై తదితర అంశాలపై విద్యార్థులకు వ్యాసరచన వంటి పోటీలను నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే,లక్ష్మి కిరణ్,మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవోలు మహేశ్వర్,రమేష్ బాబు,అధికారులు పాల్గొన్నారు.