- రఘునాథపల్లి మండల కేంద్రం నుండి కంచనపల్లి వెళ్లే రోడ్డు
- ఇబ్బందులు పడుతున్న రైతులు, వాహనదారులు
మన ప్రగతి న్యూస్ /
రఘునాథపల్లి :
రఘునాథపల్లి మండల కేంద్రం నుండి కంచనపల్లి వైపు వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉంటే.. రోడ్డుపై కంకర వేసి వదిలేశారు. ఈ రోడ్డుపై ప్రతిరోజూ రైతులు, వాహనదారులు వందల సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు.ముందు సాగని రోడ్డు నిర్మాణ పనుల వల్ల కంకర వేసి దానిపై తారు వేయకపోవడంతో వాహనదారులకు, రైతులకు తిప్పలు తప్పడం లేదు.రోడ్డు పైన ప్రయాణం చేయాలంటేనే రైతులు, ప్రమాణికులు భయం, భయంగా ప్రయాణం చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అధ్వాన రోడ్డుతో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు.అడుగడుగునా గోతులమయం కావ టంతో ఆ రహదారిపై ప్రయాణం చేసే వాహన చోదకులు అల్లాడిపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని రైతులు, ప్రయా ణికులు కోరుతున్నారు.

