- అనుమతి పేరుతో అదనపు దోపిడీ.. వాగులు లూటీ
- నిబంధనలకు పాతర.. జోరుగా అక్రమ రవాణా
- ఇటీవల పెరిగిన దందా
- సర్కారు ఆదాయానికి గండి
మన ప్రగతి న్యూస్/రఘునాథపల్లి :
రఘునాథపల్లి మండలంలోని గ్రామాలలో మరియు మండల కేంద్రంలో అనుమతి పేరుతో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. సరి హద్దుల్లో అనుమతి లేని వాగుల నుంచి దర్జాగా తోడేస్తున్నా అడిగేవారు లేకపోవడంతో అడ్డూఅదుపు లేకుండా జోరుగా దందా నడుస్తోంది.రాత్రి వేళలో జాతీయ రహదారి రోడ్డు పైన రాంగ్ రూట్లో ట్రాక్టర్ లు ఇసుక అక్రమ రవాణా చేస్తూ వేగంగా వెళ్తున్న పట్టించుకునే నాధుడే కరువయ్యారని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారులు చూసి చూడనట్లు ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి పైన ప్రమా దాలు జరిగే అవకాశం ఉందని.. కట్టడి చేయాలని ప్రజలు కోరుకుంటు న్నారు.వాగుల నుంచి దర్జాగా తోడేస్తున్నా అడిగేవారు లేకపోవడంతో అడ్డూఅదుపు లేకుండా జోరుగా దందా నడుస్తోంది. నిబంధనలు పాతరేసి వాగులను లూటీ చేస్తున్నా.. ఇందిరమ్మ ఇళ్లు, ప్రభుత్వ అవసరాల కోసమం టూ సాకులు చెబుతూ తప్పించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గతంలో అక్రమ రవాణా చేయాలంటే ట్రాక్టర్ యజమానులు భయపడేవారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ అవసరాలకు అనుమతి ఇవ్వడంతో అక్రమ రవాణాకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది.వాగు నుంచి ప్రతిరోజు ట్రాక్టర్లలో జోరుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తు ఇసుక తోడేళ్లు అక్రమ రవాణా చేస్తూ దందా చేస్తున్నారని ప్రజలు భహిరంగంగానే మాట్లాడు తున్నారు. సంబంధిత అధికారులు ఇట్టి ఇసుక అక్రమ రవాణా పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు.

