అధికారులపై మండిపడిన మంత్రి వాకిటి శ్రీహరి…
ఆత్మకూరు మున్సిపాలిటీలో రాజకీయ చర్చకు దారి తీసిన మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపన…
మన ప్రగతి న్యూస్/వనపర్తి/ఆత్మకూర్:-
వనపర్తి జిల్లా ఆత్మకూర్ మున్సిపాలిటీలో రాజకీయ చర్చకు దారి తీసిన మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి శంకుస్థాపన.శ్రీ చెర్ల పరమేశ్వర స్వామి చెరువు కట్టపై అమృత్ 2.O పథకం కింద రోడ్డు విస్తరణ–కాజ్ వే బ్రిడ్జ్ నిర్మాణానికి రూ.3 కోట్లు 14 లక్షల వ్యయంతో పనులకు మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు.శిలాఫలకంపై మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పేరు గల్లంతు రోడ్లు,భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు కూడా లేకపోవడం గమనార్హం ప్రోటోకాల్ ఉల్లంఘనపై స్థానికంగా తీవ్ర చర్చ..అధికారుల పై మండిపడిన మంత్రి వాకిటి శ్రీహరి…


