Breaking News

నేటి యువతకు ఆదర్శం ప్రొఫెసర్ డాక్టర్ గుగులోతు రాజు..

మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి:

మండల కేంద్రంలోని రుద్రగూడెం గ్రామానికి చెందిన డాక్టర్ గుగులోతు రాజుపింగిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామర్స్ విభాగంలో అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్నారు. కళాశాల విద్యాశాఖ, హైదరాబాద్ వారు ఆయన అకడమిక్ ప్రతిభ, బోధనా నైపుణ్యం, పరిశోధనా రంగంలో జాతీయ, అంత ర్జాతీయ స్థాయి సదస్సుల్లో పాల్గొనడం, అలాగే విద్యార్థుల పట్ల చూపిన నిబద్ధతను గుర్తించి అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి కల్పించారు.ఈ సందర్భంగా రుద్రగూడెం గ్రామ ప్రజలు డాక్టర్ గుగులోతు రాజు ని ఘనంగా అభినందించారు. ఆయన పదోన్నతి గ్రామానికి గర్వకారణమని పేర్కొంటూ, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి, విద్యార్థులకు మరింత సేవలు అందించాలని ఆకాంక్షించారు. డాక్టర్ గుగులోతు రాజు నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తారని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు