మన ప్రగతి న్యూస్/వేములవాడ
వేములవాడ పట్టణ శివారులోని కోనాయపల్లి సమీపంలో పేలుడు పదార్థాలు తరలిస్తున్న ఆటోను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వాహనాల తనిఖీల్లో భాగంగా పోలీసులు ఆ ప్రాంతంలో చెక్‌పోస్టు నిర్వహిస్తుండగా అటుగా వచ్చిన ఆటోను ఆపి తనిఖీ చేయగా, డ్రైవర్ అనుమానాస్పదంగా ప్రవర్తిస్తూ ఆటోను అక్కడే వదిలి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు.ఆటోను పూర్తిగా తనిఖీ చేయగా అందులో జిలెటిన్ స్టిక్స్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆటోను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, పారిపోయిన డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై పట్టణ సీఐ వీరప్రసాద్ స్వయంగా విచారణ జరుపుతున్నట్లు సమాచారం.

