మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో:
ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలో బీజేపీ జిల్లా నాయకులు గుండా ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా 15 వ జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకోవడం జరిగింది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కూసుమంచి మండల కేంద్రంలో వృద్ధ దంపతుల ఓటర్లు దామళ్లా గురవయ్య, నాగ రత్నమ్మ వార్లను కలిసి వారిని ఘనంగా సన్మానం చేయడంజరిగినది.ఈకార్యక్రమంలో స్థానిక నాయకులు మంద చంద్రశేఖర్ గౌడ్, ఆడపా శివ, తాహిర్ హుస్సేన్,బద్దం వెంకట్ రెడ్డి, దామళ్లా కోటి తదితరులు పాల్గొన్నారు.


