Breaking News

ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్‌కు రాష్ట్రస్థాయి పురస్కారం

మన ప్రగతి న్యూస్/రాజన్నసిరిసిల్ల జిల్లా:

ఓటర్ల నమోదు, ఎన్నికల నిర్వహణలో సమర్థవంతంగా విధులు నిర్వహించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు లభించింది. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమెకు ప్రతిష్టాత్మక ‘బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్’ అవార్డును ప్రదానం చేశారు.గతంలో దుబ్బాక నియోజకవర్గ ఈఆర్వో (ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్)గా పనిచేసిన సమయంలో ఎన్నికల నిర్వహణలో ఆమె చూపిన అంకితభావం, పారదర్శకత, ఓటర్ల నమోదు ప్రక్రియలో తీసుకున్న వినూత్న చర్యలను గుర్తించి ఈ పురస్కారాన్ని అందజేశారు.ప్రత్యేకించి యువ ఓటర్ల నమోదు, పోలింగ్ శాతం పెంపుదల, ఎన్నికల ప్రక్రియను మరింత సమర్థంగా అమలు చేయడంలో ఆమె చేసిన కృషి ప్రశంసనీయమని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. ఈ అవార్డు ఆమె సేవలకు రాష్ట్రస్థాయి గుర్తింపుగా నిలిచింది.

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు