మన ప్రగతి న్యూస్ / ఘట్కేసర్ మండల ప్రతినిధి:
మేడ్చల్ జిల్లా.. జిహెచ్ఎంసి ఘట్కేసర్ సర్కిల్ గట్టు మైసమ్మ జాతర సందర్బంగా అమ్మవారికి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి,ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ గట్టు మైసమ్మ జాతర శుభాకాంక్షలు.అమ్మవారి జాతర సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.గట్టు మైసమ్మ జాతరలో అమ్మ వారిని కోరుకుంటే కొంగు బంగారమై అనేక కోరికలు నెరవేరుతాయని అన్నారు.భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ఘట్కేసర్ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్,మాజీ మున్సిపల్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి,నాయకులు బొక్క విష్ణువర్ధన్ రెడ్డి,బండారి అంజి గౌడ్,పోచారం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రెడ్డియా నాయక్,మాజీ సింగిరెడ్డి సాయిరెడ్డి,నాయకులు సామల సందీప్ రెడ్డి,బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

