Breaking News

బంధన కంటి ద్రోణాచారికి మహానంది పురస్కారం అవార్డు అందజేత..

  • పురోహిత రంగం లో విశేష కృషి..
  • తెలుగు వెలుగు సాహితీ వేదిక, విజయ దారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో..
  • అభినందనలు తెలిపిన సంక్రాతి లక్ష్మారావు, మైలపల్లి వెంకటేశ్వర్లు,…. మనప్రగతి న్యూస్/ మిర్యాలగూడ/గోగువారిగూడెం జనవరి 25: బంధన కంటి ద్రోణాచారి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ మండలం గోగు వారి గూడెం గ్రామానికి చెందిన వ్యక్తి. పురోహిత రంగంలో విశేష కృషి చేసినందుకు గానుతెలుగు వెలుగు సాహి తి వేదిక, విజయదారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహానంది పురస్కారం ఆదివారం నాడు వరంగల్ ప్రెస్ క్లబ్ లో జరిగిన అవార్డు వేదికలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే న్యాయని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, యూట్యూబ్ స్టార్ ఆర్ఎస్ నంద సమక్షంలో అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత మాట్లాడుతూ.. మరింత సమాజానికి సేవ చేస్తానని అన్నారు. అవార్డు వచ్చిన సందర్భంగా బి ఆర్ఎస్ నాయకులు సంక్రాంతి లక్ష్మారావు, మైలపల్లి వెంకటేశ్వర్లు, అయినంపూడి నరసిమ్మ రావు, తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు