Breaking News

18వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి కాశమైన సందీప్ ఇంటింటి ప్రచారం

మన ప్రగతి న్యూస్/గజ్వెల్ డివిజన్ ప్రతినిధి:

సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో, కౌన్సిలర్ అభ్యర్థి కాశమైన సందీప్ తమ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) లో పట్టణ ప్రధాన కార్యదర్శి గా చురుగ్గా పనిచేస్తూ, అనేక పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన అనుభవం సందీప్‌కు ఉంది. స్థానికంగా నెలకొన్న వార్డు సమస్యలను తన వ్యక్తిగత సమస్యలుగా భావించి, వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. అనంతరం 18వ వార్డుకు చెందిన యువత మరియు మహిళలు మాట్లాడుతూ సందీప్ ఒక యువకుడు, చదువుకున్న వ్యక్తి అని కొనియాడారు. ఆయన గత కొన్ని సంవత్సరాలుగా వైద్య రంగంలో పనిచేస్తూ, కాలనీలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని గుర్తుచేశారు. సందీప్ లాంటి వ్యక్తి మా వార్డు కౌన్సిలర్‌గా ఉంటే, మా వార్డు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది అని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా,18వ వార్డు ప్రజలందరూ సందీప్‌కు ఓటు వేసి, భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు.

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు