- 30 మద్యం సీసాల స్వాధీనం, ఒకరి అరెస్ట్..
మన ప్రగతి న్యూస్/విశాఖపట్నం:
శ్రీహరిపురం పరిధిలో అక్రమంగా మద్యం నిల్వ చేసి విక్రయాలు నిర్వ హిస్తున్న వ్యక్తి పై ఎక్సైజ్ పోలీసులు ఆకస్మిక దాడి నిర్వ హించారు. ఈ దాడిలో 30 మద్యం సీసా లను పోలీసులు స్వాధీనం చేసుకుని, ఒక రిని అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీఐ. గొల్లగాన అప్పారావు ఆదేశాల మేరకు.. ఎక్సైజ్ పోలీసులు శ్రీహరిపురం ప్రాంతంలో తనిఖీలు చేపట్టగా. కడవాల సంకరరావు అనే వ్యక్తి అనధికారికంగా మద్యం నిల్వ ఉంచి విక్రయాలు జరుపు తున్నట్లు గుర్తించి, దాడి చేశారు. ఈ సమయంలో నిందితుడి వద్ద విక్రయానికి సిద్ధంగా ఉంచిన 30 మద్యం సీసాలు, ప్యాకెట్లు లభ్యమయ్యాయి. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని ఎక్సైజ్ చట్టం సెక్షన్ 34 (ఎ) కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపా రు. అక్రమ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తప్పవని,చట్టాన్ని ఉల్లంఘించే వారిపై నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకుం టామని పోలీసులు హెచ్చరించారు.

