Breaking News

టేకుల మేడారం – మద్ది మేడారం జాతర ఏర్పాట్లలో తీవ్ర నిర్లక్ష్యం.

రూ.29.23 లక్షల నిధులు ఉన్నా భక్తులకు కనీస సౌకర్యాలు లేవు.

నాసిరకం పనులపై తక్షణ చర్యలు తీసుకోవాలి.

బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బానోతు సారంగపాణి డిమాండ్.

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు

మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి

మండలంలోని టేకుల మేడారం – మద్ది మేడారం జాతర ఏర్పాట్లను నల్లబెల్లి బిఆర్ఎస్ మండల పార్టీ నాయకులు పరిశీలించగా, అధికారుల నిర్లక్ష్యం, నాసిరకం పనులు, పర్యవేక్షణ లోపం స్పష్టంగా వెలుగులోకి వచ్చిందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.జాతరకు కేవలం రెండు రోజులే మిగిలి ఉన్నప్పటికీ భక్తులకు అత్యంత అవసరమైన తాగునీటి సౌకర్యం పూర్తిగా అస్తవ్యస్తంగా ఉందన్నారు. బోర్లు వేసినా నీరు రాకుండా మోటార్లు దించడం,వాస్తవానికి ఉపయోగం లేకపోయినా కేవలం బిల్లుల కోసమే పనులు చేసినట్టుగ పరిశీలనలో స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు.అదేవిధంగా ఇప్పటివరకు విద్యుత్ ఏర్పాట్లు కూడా పూర్తికాకపోవడంతో రాత్రి సమయంలో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం జాతర ఏర్పాట్ల కోసం రూ.29 లక్షల 23 వేల నిధులు మంజూరు చేసినప్పటికీ, ఆ నిధులను భక్తుల సౌకర్యానికి వినియోగించకుండా నాసిరకం పనులు చేయించడం, పనులను నత్తనడకన సాగించడం వెనుక ఎవరి బాధ్యత ఉందో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.మద్ది మేడారంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుండగా, అధికారులు వెంటనే స్పందించి అత్యవసర ప్రాతిపదికన అన్ని పనులు పూర్తి చేయాలని కోరారు.ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు వచ్చే ఈ పవిత్ర జాతరను అధికారులు తేలిగ్గా తీసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. కనీసం తాగునీరు, కరెంట్, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులు కూడా సకాలంలో ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉండటం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టి, అన్ని పనుల ఏర్పాట్లు పూర్తిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని బిఆర్ఎస్ మండల పార్టీ డిమాండ్ చేసింది.ఈ సమావేశంలో పాక్స్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ రావు, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి కోటిలింగా చారి, మాజీ వైస్ ఎంపీపీ గందె శ్రీనివాస్ గుప్తా, మద్ది మేడారం మాజీ చైర్మన్ చిట్యాల సీతారాం రెడ్డి, క్లస్టర్ ఇంచార్జి మామిళ్ల మోహన్ రెడ్డి ,మాజీ సర్పంచ్ గోనె శ్రీదేవి, గాదె కుమారస్వామి లతో పాటు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు.