-మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 78 ఏండ్ల బహుజనుల గోస కరపత్రం ఆవిష్కరణ.
-రాష్ట్ర కో ఆర్డినేటర్ దాగిల్ల దయానంద్ రావు.
మన ప్రగతి న్యూస్/కరీంనగర్ జిల్లా స్థాపర్:
కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్ అధ్వర్యంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది.దీనికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కోఆర్డినేటర్ దాగిల్ల దయానంద రావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులను పోటీలో నిలుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ కార్పొరేషన్ను బహుజన్ సమాజ్ పార్టీ కైవసం చేసుకునే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న బీసీ,ఎస్సీ,ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు అందరూ బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పేర్కొన్నారు.ఎందుకంటే గత రెండు సంవత్సరాల క్రితం ఏర్పాటైనటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు.గత ఎన్నికలలో 420 ఫేక్ హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అందులో కనీసం ఒకటి రెండు కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చలేని పరిస్థితిలో ఈరోజు హామీలన్నింటినీ తుంగలో తొక్కి మళ్ళీ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు.అధికార పార్టీకి తగిన రీతిలో బుద్ధి చెప్పేలా కార్పొరేషన్ పరిధిలో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులు గెలుపొందుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో మతకల్లోలాలు లేపుతూ మతతత్వ ముసుగులో పూర్తిగా రాష్ట్రాన్ని వాళ్ళ కంట్రోల్ లోకి తీసుకోవాలని వాళ్లు ప్రయత్నం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా తెలంగాణను గత పది సంవత్సరాలు బ్రష్టు పట్టించి మళ్లీ అధికార దాహం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన టిఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు.అందుకోసమే ఈ పార్టీలన్నింటికీ బుద్ధి చెప్పడం కోసం బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ఆయన కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ అక్కి బాలకిషన్,జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్,జిల్లా ప్రధాన కార్యదర్శి మహంకాళి తిరుపతి,చొప్పదండి అసెంబ్లీ అధ్యక్షులు కాంపల్లి రాజు,చొప్పదండి అసెంబ్లీ కార్యదర్శి కుమ్మరి సంతోష్,బివిఎఫ్ నాయకులు గుడిసె ప్రభాకర్,కరీంనగర్ జిల్లా కమిటీ సభ్యులు అనిల్,తదితరులు పాల్గొన్నారు.

