Breaking News

దంపతులకు ఉత్తమ అవార్డులు

మన ప్రగతి న్యూస్ / వనపర్తి ప్రతినిధి :

వనపర్తి జిల్లా మదనాపురం సాంఘిక సంక్షేమ వసతి గృహధికారి బెనర్జీ, కొత్తకోట మున్సిపాలిటీలో విధులు నిర్వర్తిస్తున్న ఆశవర్కర్ భాగ్యకు గణతంత్ర దినోత్సవం సందర్బంగా ఉత్తమ అవార్డులు లభించింది. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలో గణతంత్ర దినోత్సవం వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి ఎమ్మెల్యే మేఘరెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డి, ఎస్పీ సునీత రెడ్డి చేతుల మీదుగా యాత్తమ అవార్డులను అందుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ అవార్డులు రావడం పట్ల మరింత బాధ్యత పెరిగిందని మా విధులు మరింత మెరుగుగా పని చేస్తామని తెలిపారు. అవార్డులు రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపారు. భార్యభర్తలకు ఉత్తమ అవార్డులు రావడం పట్ల కొత్తకోట పట్టణ నాయకులు, స్నేహితులు, మిత్రులు సంతోషం వ్యక్తం చేశారు.

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు