నోడల్ అధికారులను నియమించినట్లు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ కే. హైమావతి తెలిపారు…
మన ప్రగతి న్యూస్/ సిద్దిపేట జిల్లా స్టాపర్:
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో గల హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల,గజ్వేల్, ము న్సిపాలిటీలకునిర్వహించనున్న 2వ సాధారణ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షణ నోడల్ అధికారులను నియమించినట్లు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ కే. హైమావతి తెలిపారు.రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని మంగళవారం జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మున్సిపల్ ఎన్నికలలో అధికారులు అంకితభవంతో పనిచేసి ఎలాంటి తప్పులకు తావు లేకుండా మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలనిఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమీదిని ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన అనంతరం జిల్లా కలెక్టర్ కే.హైమావతి కలెక్టరేట్లో మున్సిపల్ ఎన్నికల జిల్లా నోడల్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో మ్యాన్‌పవర్ మేనేజ్‌మెంట్, శిక్షణ, బ్యాలట్ బాక్సులు,రవాణా,మెటీరియల్ మేనేజ్‌మెంట్, ఖర్చుల పర్యవేక్షణ, మీడియా, హెల్ప్‌లైన్, ఫిర్యాదుల పరిష్కారం, నివేదికలు, మైక్రో ఆబ్జర్వర్లు తదితర కీలక అంశాలకు జిల్లా స్థాయిలో బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.నియమితులైన నోడల్ అధికారులు జిల్లా ఎన్నికల యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, ఆదేశాల ప్రకారంవిధులునిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే జిల్లా యంత్రాంగం లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
ప్రతిఅధికారిబాధ్యతాయుతంగా ఎలాంటి పొరపాటుకు తావులేకుండా విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికలఅధికారిఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ నాగరాజమ్మ, కలెక్టరేట్ ఏవో రాజ్ కుమార్, డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, డీఈఓ శ్రీనివాస్ రెడ్డి, జడ్పీసీఈఓ రమేష్,డిపిఆర్ఓరవికుమార్,ఈడీ ఎస్సీ కార్పొరేషన్, డివిజనల్ పంచాయతీ అధికారి, సహకార అధికారి నాగేశ్వరరావు, ఎన్నికల శిక్షణ అధికారులు అయోధ్య రెడ్డి, రామస్వామి, అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

