-విద్యార్థినులలో ఆత్మవిశ్వాసాన్ని,ధైర్యాన్ని పెంచడమే స్నేహిత కార్యక్రమం లక్ష్యం.
-జిసిడిఓ కృష్ణారాణి
మన ప్రగతి న్యూస్/కరీంనగర్ జిల్లా ప్రతినిధి:
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం గర్ల్ చైల్డ్ ఎం పవర్ మెంట్ మరియు ఆడోల్ సెంట్ సేఫ్టీ క్లబ్ లో భాగంగా స్నేహిత ఫేస్-2 కార్యక్రమము విజయవంతంగా జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిసిడిఓ కృష్ణారాణి గారు మాట్లాడుతూ బాల బాలికలు ఎవరికీ చెప్పుకోలేని సమస్యలను గ్రీవియన్స్ బాక్స్ లో కాంప్లైంట్ రూపంలో వేయడం ద్వారా తక్షణ పరిష్కారాలను పొందవచ్చనీ,అది ఎంతో గోప్యంగా, కాన్ఫిడెన్సియల్ గా వారి పేరు ఉంటుందని, పాఠశాలలో అన్ని రకాల క్లబ్స్ పనితీరు చాలా బాగుంది అనీ,పిల్లలందరూ క్రమశిక్షణ కలిగి,ప్రతిరోజు పాఠశాలకు హాజరుకావాలని అన్నారు.ఈ కార్యక్రమానికి చైల్డ్ ప్రొటెక్షన్ వింగ్ డిస్ట్రిక్ కోఆర్డినేటర్ సంపత్ గారు,సిడిపిఓ శ్రీలత,జిసిడిఓ కృపారాణి,ఏఈఓ శిరీష,ఎంఎల్ హెచ్ పి నిహారిక,హెడ్ కానిస్టేబుల్ భాస్కరాచారి, గ్రామ కార్యదర్శి ప్రేమ్ కుమార్,డబ్ల్యూ పిసి శ్వేత,అనూష,ఏఎన్ఎంలు మరియు అంగన్వాడి టీచర్లు,ప్రధానోపాధ్యాయులు వి.రవీందర్,స్నేహిత ఇన్చార్జి టీచర్లు ఇ.మైథిలి,ఇ.దేవేందర్ రెడ్డి,మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


