Breaking News

జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ చేతుల మీదుగా అగ్రి డాక్టర్ల డైరీ విడుదల

మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్

తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీని ఖమ్మం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ తమ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ మాట్లాడుతూ, రైతులకు సరైన సమాచారం, శాస్త్రీయ సాగు పద్ధతులు అందించడంలో అగ్రి డాక్టర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. రైతుల సమస్యలను దగ్గరగా తెలుసుకొని, వారికి అవసరమైన మార్గనిర్దేశం చేయడంలో అగ్రి డాక్టర్ల సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ రూపొందించిన ఈ డైరీ అగ్రి డాక్టర్లకు మాత్రమే కాకుండా వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులకు కూడా ఉపయోగపడేలా ఉందని తెలిపారు. సాగు పద్ధతులు, పంటల సమాచారం, వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇందులో ఉండటంతో ఇది అందరికీ ఉపయోగంగా ఉంటుందని అన్నారు.డైరీ ఆవిష్కరణకు విలువైన సమయం కేటాయించిన జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ కి తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా జనరల్ సెక్రటరీ డి. బాలాజీ, కేంద్ర సంఘ సభ్యుడు బి. కిషోర్‌లు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్యకు కూడా వారు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, అగ్రి డాక్టర్లు, అసోసియేషన్ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు