_ ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్..
_ ఎస్ ఈ సీ నిబంధనలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలి..
మన ప్రగతి న్యూస్ /
రాజన్న సిరిసిల్ల జిల్లా స్టాపర్:
రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ ఈ సీ) నిబంధనలకు అనుగుణంగా అధికారులు అందరూ ముందుకు వెళ్లాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు, తహసిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో ఇంచార్జి కలెక్టర్ జిల్లా సమీకృత కార్యాలయం నుంచి మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీలో పరిధిలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఫ్లెక్సీలు, హోర్డింగులు, చిత్ర పటాలు, శిలాఫలకాలు మూసివేయాలని సూచించారు. బస్ స్టాండ్, ఇతర ప్రభుత్వ ఆస్తుల వద్ద ఏమీ ఉండవద్దని, మున్సిపాలిటీలో వార్డ్ ఆఫీసర్లు, జిపిఓలు లతో వెంటనే ఈ ప్రక్రియ మొదలు పెట్టాలని ఆదేశించారు.
ఆయా మున్సిపాలిటీలోని నామినేషన్ కేంద్రాల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, దానిలోని సిబ్బందికి నామినేషన్ పై పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. నామినేషన్ కేంద్రాల్లో ఫ్లెక్సీలు, సీసీ కెమెరాలు, గడియారం ఉండాలని బుధవారం ఉదయం నామినేషన్ సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించాలని ఆదేశించారు. నామినేషన్లు దాఖలు చేసి అభ్యర్థులు కచ్చితంగా నూతన బ్యాంకు ఖాతా, అఫిడవిట్ ఇతర పత్రాలు సమర్పించాలని సూచించారు. నామినేషన్ కేంద్రాల కు 100 మీటర్ల వరకు అభ్యర్థులకు సంబంధించిన రెండు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. నామినేషన్ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు ఇద్దరికీ అనుమతి ఉంటుందని వెల్లడించారు. నిబంధనలకు అనుగుణంగా రిటర్నింగ్ ఆఫీసర్లు ముందుకు వెళ్లాలని సూచించారు నామినేషన్లకు సంబంధించి ప్రతి రోజు రాష్ట్ర ఎన్నికల సంఘం సంఘానికి ఆన్లైన్లో పంపించాలని, ప్రతి నామినేషన్ను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు
టెలి కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అదనపు ఎస్పీ చంద్రయ్య సిరిసిల్ల వేములవాడ అడవులు వెంకటేశ్వర్లు రాధాబాయి మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

