Breaking News

దుబ్బాక గ్రామానికి చెందిన గుండాల శ్రీనివాస్ అదృశ్యం

మన ప్రగతి న్యూస్ /రామన్నపేట:

మండల పరిధిలోని దుబ్బాక గ్రామానికి చెందిన గుండాల శ్రీనివాస్ వయస్సు 38.ఈ నెల 3వ తేదీ ఉదయం 12గంటల సమయం లో ఇంటి నుంచి బయలుదేరి రామన్నపేటకు వచ్చిన వ్యక్తి ఇప్పటి వరకు ఇంటికి రాలేదని గుండాల శ్రీనివాస్ భార్య మల్లేశ్వరి పోలీసులను ఆశ్రయించింది.ఇదే నెల 13వ తారీకున తన తల్లి తో ఫోన్ లో చివరిసారిగా మాట్లాడాడని,తన భర్త గురించి బందువుల దగ్గర,చుట్టుపక్కల వెతికినా కూడా జాడ తెలియరాలేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. తమకు వచ్చిన ఫిర్యాదు విషయమై ఎస్సై డి.నాగరాజు మాట్లాడుతూ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు