Breaking News

మనప్రగతి తెలుగు దినపత్రిక నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

మనప్రగతి న్యూస్/రామన్నపేట:

మన ప్రగతి తెలుగు దినపత్రిక 2026 నూతన క్యాలెండర్ ను రామన్నపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ,ఉప సర్పంచ్ మోటె రమేష్ మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ మన ప్రగతి దినపత్రిక వాస్తవాదారిత సమాచారంతో ప్రజల విశ్వాసాన్ని పొందిందని తెలిపారు.నూతన సంవత్సరంలో పాఠకుల ఆశయాలకు అనుగుణంగా మరింత సేవాభావంతో ముందుకు సాగాలని కోరుతూ మన ప్రగతి పాఠకులకు, మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు,ప్రజా ప్రతినిధులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు