Breaking News

రోడ్డు భద్రతే లక్ష్యం… ఘట్‌కేసర్ లో అర్రివ్ అలైవ్ – డ్రైవర్స్ డే

మన ప్రగతి న్యూస్/ ఘట్కేసర్ మండల ప్రతినిధి:

ఘట్‌కేసర్:-రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాలను పురస్కరించుకొని జిహెచ్ఎంసి ఘట్కేసర్ సర్కిల్ కార్యాలయము నందు డిప్యూటీ కమిషనర్ ఏ వాణి మరియు పోలీస్ అధికారులు కార్యాలయ సిబ్బందికి రోడ్డు భద్రత గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.పోలీసులు,మున్సిపల్ అధికారులు సంయుక్తంగా ‘అర్రివ్ అలైవ్ – డ్రైవర్స్ డే’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బందికి రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించి ఈ సందర్భంగా ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ ఎం. బాలస్వామి మాట్లాడుతూ నిర్లక్ష్య డ్రైవింగ్ వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.వేగ నియంత్రణ పాటించడం,మద్యం సేవించి వాహనం నడపకపోవడం,హెల్మెట్,సీట్‌బెల్ట్ తప్పనిసరిగా వినియోగించడం ద్వారా అనేక ప్రాణాలను కాపాడవచ్చని స్పష్టం చేశారు.ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలన్నారు.ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలనే ఉద్దేశంతో ‘అర్రివ్ అలైవ్’ నినాదాన్ని పోలీసులు ప్రజల్లోకి తీసుకెళ్లారు.ఈ సందర్బంగా రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు.రోడ్డు ప్రమాదాల నివారణకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్సై ప్రభాకర్ రెడ్ది,అధికారులు,ఉద్యోగులు,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు