Breaking News

తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కల్వకుర్తి ఎమ్మెల్యేమన ప్రగతి న్యూస్ /కల్వకుర్తి:కల్వకుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి ఆమనగల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బట్టు కిషన్ రెడ్డి నాయకులు సూదిని కొండల్ రెడ్డి తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి కసిరెడ్డి విజేందర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రత్యేక దర్శనంలో స్వామి వారిని దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ శ్రీ శ్రీ కలియుగ దైవం తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ని దర్శించుకొని కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు,రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజల పై స్వామి వారి కృప కటాక్షములు, సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుని కోరుకోవడం జరిగింది.అనంతరం ఆలయం నిర్వహకులు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి వారితో పాటు హాజరైన నాయకులను శాలువాతో సన్మానించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేసినారు.

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు