Breaking News

ఆమనగల్లు మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం

మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ గుర్రం కేశవులు

బీజేపీ పార్టీ నాయకులు కాంగ్రెస్ లో చేరిక

మన ప్రగతి న్యూస్ /ఆమనగల్లు:

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు

ఆమనగల్లు మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ గుర్రం కేశవులు సమక్షంలో జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు దుడ్డు లక్ష్మయ్య తన అనుచరులతో కలిసి మండల పరిషత్ మాజీ కో ఆప్షన్ సభ్యుడు ఖాదర్ ఖాద్రి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.పార్టీలో చేరిన వారికి మున్సిపాలిటీ అధ్యక్షుడు వస్పుల మానయ్యతో కలిసి కాంగ్రెస్ కండువ కప్పి పార్టీలోకి స్వాగతించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆమనగల్లు మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలను చూసి వివిధ పార్టీల నాయకులు ప్రజలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నారు.కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో ఆమనగల్లు మున్సిపాలిటీ గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు.రూ. 63 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు చెప్పారు.360 మందికి ఇందిరమ్మ ఇల్లు,520 మందికి రేషన్ కార్డులు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు.రూ.2 కోట్లతో మున్సిపాలిటీ భవనం, రూ.4 కోట్లతో బీసీ వసతిగృహ భవనం రూ 17.50 కోట్లతో ఆసుపత్రి భవనం నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.ఆమనగల్లు మున్సిపాలిటీ అభివృద్ది కాంగ్రెస్ తోనే సాధ్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు శివలింగం,కాలే మల్లయ్య,మైసయ్య,శ్రీనివాస్ రెడ్డి,శ్రీను నాయక్, రమేశ్,కొండల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు