Breaking News

విద్యార్థులకు బహుమతులు అందజే సిన స్నేహ సేవ ఫౌండేషన్..

మన ప్రగతి న్యూ /కమలాపూర్:

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల పరిధిలోని కానీపర్తి ప్రాథమిక పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థులకు ఆటలు పోటీలు నిర్వహించారు. ఆటల పోటీలలో గెలిచిన విద్యార్థిని విద్యార్థులకు స్నేహ సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బహుమతులను ఇవ్వడంతో పాటు మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా కానిపర్తి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ స్నేహ సేవ ఫౌండేషన్ వారు ప్రతి సంవత్సరం పిల్లలకి తమ వంతు సహాయం చేస్తున్నా రని కొనియాడారు. కానీపర్తి ముద్దుబిడ్డ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడ్డ స్నేహ సేవా ఫౌండేషన్ అంచెలంచెలుగా ఎదుగుతూ మండల స్థాయి లో కూడా తమ సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందించదగ్గ విషయమని అన్నారు. 77 గణతంత్ర దినోత్సవం సందర్భంగా మాటూరి రమణాచారి, ప్రసాద్.. విద్యార్థులకు ప్లేట్స్, గ్లాస్ లు, స్పూన్స్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బహుమతులు ప్రధాన చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోడిగుడ్డు చేరాలు, ఉపసర్పంచ్ జనగాని చారి బాబు, వార్డు మెంబర్లు ,మాజీ సర్పంచ్ ఇంద్రసేన ,గ్రామ పెద్దలు ధర్మల మొగులయ్య, కోడిగుటి బాలరాజు ,స్నేహ సేవ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు తొగరి అన్నమయ్య, ప్రధాన కార్యదర్శి కన్నెబోయిన అశోక్ ,కోశాధికారి జనగాని రామ్మోహన్ ,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు