Breaking News

కొండ పైన వెలసిన స్వయంభు వారాహి లక్ష్మి నరసింహ స్వామి రూపం..

  • గుట్టపై స్వయంభూగ అవతరించిన రూపాన్ని వారాహి లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహంగ స్పష్టం చేసిన అనంత ఆచార్యులు
  • ఋష్య ముఖ పర్వతం పైన కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల స్వామి అంటున్న ఆలయ కమిటీ సభ్యులు
  • 21 సంవత్సరాల తర్వాత గుట్టకు ఒక ప్రత్యేకత వచ్చింది అంటున్న ఆలయ నిర్వహకులు

మన ప్రగతి న్యూస్/ మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామంలోని ఋష్య ముఖ పర్వతం పైన ఫిబ్రవరి ఒకటిన వెంకటేశ్వర స్వామి కళ్యాణo ఉన్న సందర్భంగా గుట్ట పైన ఆలయమునకు వచ్చే భక్తుల సౌకర్యం కోసం చదును చేస్తుండగా స్వయంబుగా వెలిసిన వరాహ లక్ష్మీ నరసింహ స్వామి రూపం దర్శించడం జరిగిందన్నారు.మాఘ శుద్ధ పౌర్ణమి సందర్బంగా బాలాజీ వేంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని కొండపై ఏర్పాట్లు చేస్తున్న భక్తులకు కొండపై అవతరించి ఉన్న ఒక ఆకారంతో కూడిన రూపాన్ని చూసి ఆశ్చర్యానికి లోనై మందమర్రి వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రధాన అర్చకులు ఆనంతాచార్యులు సమాచారం ఇవ్వగ వారు స్వయంగా వచ్చి తిలకించి వారు పరీక్షించి చూసి ఇది స్వయంబు వరాహలక్ష్మీ నరసింహస్వామి రూప మని ఆలయ కమిటీ వారికి స్పష్టత చేసి నిర్ధారించిన అనంతరం ఆలయ కమిటీ గ్రామస్థులతో కలసి పూజలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బాగంగా ఆలయ అధ్యక్షులు బలికొండ కిషన్, హిందూ ఉత్సవ సమితి కార్య దర్శి కర్ణ కంటి రవీందర్,కండె బద్రీ నారాయణ,నేచర్ అనిమల్ చైర్ ట్రస్ట్ సెక్రటరీ వేముల హరిప్రసాద్, రవి,చెందు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు