-భక్తజనులతో కిటకిటలాడిన ఆలయం- ఆలయ ప్రాంగణం
మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:
యాదాద్రి భువనగిరి జిల్లా ,భూదాన్ పోచంపల్లి లో బుధవారం నాడు శ్రీ మార్కం డేశ్వర స్వామి రథోత్సవం మహా వైభవంగా జరిగింది. స్వామివారి రధాన్ని రంగు రంగుల పూలతో శోభాయ మయంగా అలంకరింపజేశారు. రధములో స్వామివా రి- అమ్మవారి ఉత్సవ విగ్రహమూర్తులను పండితులు అధిష్టింప జేశారు. సీత వా రి సేనచే తాళ -మేల మృదంగ వాయిద్యముల, భక్తి రస విన్యాసంలతో కోలాట నృత్య ప్రదర్శనలతో స్వామివారి రథమును పట్టణ పురవీధులలో చేనేత కార్మిక సంఘం సహకారంతో ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తజనులు స్వామివారిని మంగళహారతులతో స్వాగతించారు.స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్ర మంలో ఆలయ కమిటీ చైర్మన్ సీత సత్యనారాయణ ,ఉపాధ్యక్షుడు ఆంజనేయు లు ప్రధాన కార్యదర్శి అంకం యాదగిరి సహాయ కార్యదర్శి గుర్రం కృష్ణ కోశాధికారి ఈ .యాదగిరి, పద్మ బ్రాహ్మణ పురోహిత సంఘం అధ్యక్షుడు రుద్ర పాండురంగ శాస్త్రి ,ధర్మకర్తలు, భజన మండలి వారు ,తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం ఆలయంలో జరిగిన చక్రవ రి సేవా కార్యక్రమంలో భక్తజనులు అధిక సంఖ్యలో ఆ లయానికి సందర్శించి ,స్వామివారికి దీపరాజ్యం చేసి, టెంకాయలు -కట్న కానుక లు సమర్పించారు .దీంతో ఆలయంలో ,ఆలయ ప్రాంగణంలో భక్తులు కిటకిటలా డారు .అనంతరం పద్మశాలి యువజన సంఘం వారిచే సాంస్కృతిక కార్యక్రమా లు నిర్వహింపబడ్డాయి.

