మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి:
బీబీనగర్ బాంబినో ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తూ కార్మికుల సమస్యలపై ఎనలేని కృషి చేశారని సిఐటియు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి కొనియాడారు.శుక్రవారం రోజున సిఐటీయూ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో పాల్గొని చంద్రారెడ్డి మాట్లాడుతూ
రెండు నెలల క్రితం గుండె పోటుతో మన నుండి దూరమయ్యారని అన్నారు.వారు భౌతికంగా మన మధ్యన లేకపోయినా ఆయన ఆశయాలు మన మధ్యన ఉన్నాయని అన్నారు.వారి ఆశయ సాధన కోసం మనమందరం కృషి చేయడం ద్వారానే నిజమైన నివాళులు అర్పించినవాళ్ళం అవుతామని అన్నారు.దోపిడీకి గురిఅయ్యే కార్మికులను సంఘటితం చేసి వారి హక్కుల కోసం పోరాటాలు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శులు తుర్కపల్లి సురేందర్,పొట్ట యాదమ్మనాయకులు ఓవల్దాస్ సతీష్,బండారు శ్రవణ్,బాలబోయిన జంగయ్య,సయ్యద్ ఉమర్,మేకల బాబు,వివిధ రంగాల కార్మికులు పాల్గొన్నారు.

