Breaking News

జాతర ముగిసినా మద్ది మేడారంలో పొటేత్తుతున్న భక్తులు

మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి

మద్ది మేడారం జాతర ముగిసినా భక్తుల మొక్కులు, రద్దీకొనసాగుతుంది.ఆదివారం కావడంతో సమ్మక్క, సారలమ్మ దేవతలను దర్శించుకునేందుకు గద్దెల పరిసరాల్లో భక్తులు పోటెత్తుతున్నారు.జాతర తర్వాత కూడా వనప్రవేశం చేసిన దేవతలను దర్శించుకోవడానికి భక్తులు తరలివస్తున్నారు.ముడుపులు కడుతూ, ఎత్తుబంగారం, కానుకలు,పసుపు, కుంకుమ సమర్పించి, తమ మొక్కులను సమర్పిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు..అధికారులు, గ్రామ పంచాయతీ కార్మికులతో వ్యర్థాల తొలగింపు కార్యక్రమం కొనసాగుతోంది.

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద కఠిన నిషేధాజ్ఞలు..