మనప్రగతి న్యూస్/ఎల్లారెడ్డిపేట
రాజన్న సిరిసిల్ల జిల్లా ‘ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లో గల శ్రీ చైతన్య స్కూల్ సమీపంల రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే వెంకటాపూర్ గ్రామానికి చెందిన చాట్ల సాయికుమార్ ద్విచక్ర వాహనంపై వెంకటాపూర్ నుండి మాచారెడ్డి కి తన భార్య పిల్లలను తీసుకురావడానికి బయలుదేరగా తనతో అదే గ్రామానికి చెందిన గొట్టే శశిధర్ (25) ఎల్లారెడ్డిపేటలో బ్యాంకు పనిమీద చాట్ల సాయికుమార్ పల్సర్ బైక్ (TA23E2141) మీద లిఫ్ట్ అడగడంతో ఇద్దరు కలిసి వెంకటాపూర్ నుండి బయలుదేరారు, ఎల్లారెడ్డిపేట లోని శ్రీ చైతన్య స్కూల్ సిరిసిల్ల – కామారెడ్డి ప్రధాన రహదారి వద్ద వెనుక నుంచి వస్తున్న షిఫ్ట్ డిజైర్ (TS23C8130) గల కారు వెనుక నుంచి గుద్దడంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి, వెంటనే పోలీసులు అక్కడి చేరుకొని ఇద్దరినీ స్థానిక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు,కారు యజమాని వేములవాడ మండలం అగ్రహారానికి చెందిన సయ్యద్ గోరిమియా తండ్రి హైదర్ (29) ఫోన్ నెంబర్: 9949866921 అను అతను అతని కారులోనే బాధితులను స్థానిక హాస్పిటల్లో చేర్పించి పరారయ్యాడు,అతనికి పోలీసులు, మరియు స్థానికులు ఫోన్ చేయగా ఫోను స్విచాఫ్ పెట్టుకుని ఉన్నాడు కావున స్థానిక పోలీసులు తనపైన వెంటనే చట్టరీత్య చర్య తీసుకుని కేసు నమోదు చేసి తీసుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు*

