కొత్తగూడం సింగరేణి ఏరియా ఐ ఎన్ టి యు సి నాయకులు…!!!
మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కుట్టు గూడెం సింగరేణి ఏరియా హెడ్ ఆఫీస్ కార్పొరేట్ నందు సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తూ శనివారం పదవి విరమణ పొందుతున్న ఐఎన్టీయూసీ చీఫ్ ఆర్గనైజ్ సెక్రెటరీ నక్వి సింగరేణి సంస్థలో సుదీర్ఘంగా 41 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకుని పదవి విరమణ చేయుచున్న సందర్భంగా వారికి ఐఎన్టీయూసీ సీనియర్ ఉపాధ్యక్షులు త్యాగరాజు, అసిస్టెంట్ జనరల్ సెక్రెటరీ ఆల్బర్ట్, కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, కార్పొరేట్ ఉపాధ్యక్షులు పితంబర్రావు పాల్గొని వారికి ఘనంగా సన్మానం చేయడం జరిగింది, వక్తలు మాట్లాడుతూ నక్వి కొత్తగూడెం ఏరియాలో వివిధ డిపార్ట్మెంట్ లలో పని చేసి తదుపరి కార్పొరేట్ నందు పదవి విరమణ పొందారు, వారు రిటైర్మెంట్ లైఫ్ ని కుటుంబ సభ్యులతో పాటు మరియు ఐఎన్టీయూసి యూనియన్ కు సహకారం అందించాలని, వారు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ వారికి ఐఎన్టియుసి యూనియన్ ద్వారా శుభాకాంక్షలుతెలియజేయడమైనది , ఈ కార్యక్రమంలోఐఎన్టియుసి నాయకులు కొమురయ్య, సురేందర్, సంజీత్, లలిత లక్ష్మి, జక్కుల సత్యనారాయణ, ఈశ్వర్ రావు, మిత్రుడు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.

