Breaking News

సీఎం కప్ క్రిడలో తిగుల్ విద్యార్థుల ప్రతిభ

మనప్రగతి న్యూస్/జగదేవపూర్ ప్రతినిధి:

సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండల పరిధిలోని తీగుల్ లో సీఎం కప్ క్రిడ మండల స్థాయి పోటీలు తిగుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచి ప్రతిభ చాటారు. శనివారం మండల కేంద్రమైన జగదేవపూర్ లో బాలుర ఉన్నత పాఠశాలలో మండల స్థాయి సీఎం క్రీడా పోటీలను తహసిల్దార్ నిర్మల, ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, ఎస్సై కృష్ణారెడ్డి, ఎంఈఓ సైదులు, ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ పోటీల్లో తిగుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఖోఖో క్రిడలో బాలికలు ప్రథమం, ఖోఖో బాలుర పోటీల్లో ప్రథమం, బాలుర వాలీబాల్ పోటీల్లో ప్రథమం రాణించి మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. మూడు విభాగాల్లో ప్రథమ స్థానం రావడంతో విద్యార్థులను మండలం స్థాయి అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఎంపీడీవో చేతుల మీదుగా బహుమతులను అందించారు. ఈ సందర్భంగా మండల స్థాయి క్రీడా పోటీలో ప్రతిభా చాటి ప్రథమ స్థానంలో నిలవడంతో గ్రామ సర్పంచి రజిత క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు.అలాగేప్రధానోపాధ్యాయులు అనసూయ, పి ఈ టి రాజిరెడ్డిలను అభినందించారు.

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద కఠిన నిషేధాజ్ఞలు..