మన ప్రగతి న్యూస్/ నర్సంపేట
నర్సంపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు అయిన సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ రాజ్యసభ సభ్యులు,జాతీయ కౌన్సిల్ సభ్యులు గరికపాటి మోహన్ రావు ,వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి, కాంటెస్టెడ్ అభ్యర్థి కంభంపాటి పుల్లారావు.అనంతరం గరికపాటి మోహన్ రావు మాట్లాడుతూ……భారతీయ జనతా పార్టీ నర్సంపేట మున్సిపాలిటీలో పోటీ చేసిన అభ్యర్థులు ప్రజల్లోకి ఎలా వెళ్లాలో మరియు నర్సంపేట మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పెట్టుకుని ప్రతి గడపగడపకు మోదీ సంక్షేమ ఫలాలు తీసుకెళ్లాలని అన్నారు.నమ్మిన సిద్ధాంతం కోసం కష్టపడి, ఎన్ని అవకాశాలు వచ్చిన, ఎన్ని బెదిరింపులు వచ్చినా తట్టుకొని నిలబడి నమ్ముకున్న జెండా కోసం పోరాటం చేసే ఒక కార్యకర్తగా, ఇప్పటి వరకు ఏమి ఆశించకుండా ప్రజాల తరుపున కొట్లాడుతున్నాటుగానే,
ఇంకా కష్టపడి ప్రజలకు సేవ చేసే అవకాశం కోసం, ఇంకా బలంగా కొట్లాడాలనే ఆలోచనతోటీ మాత్రమే పార్టీ తరుపున చేశారని గెలిచిన, ఓడిన నమ్ముకున్న ప్రజలనీ,
ఇచ్చిన మాటకోసం కట్టుబడి చచ్చేవరకు పోరాడే ధైర్యాన్ని బీజేపీ కార్యకర్తల సొంతమని, అదే ధైర్యంతోటి కొట్లాడతానని
మీ అందరి ప్రజల మరియు ఆ భగవంతుని ఆశీర్వాదాలు ఉండాలి ఈ సందర్భంగా వారు కోరుకున్నారు
ఈ కార్యక్రమంలో…. రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డపెల్లి నరసింహారాములు, జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్, అజ్మీర శ్రీనివాస్, పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రామచందర్ రెడ్డి,జిల్లా నాయకులు మార్టిన్ లూథర్, శ్రీనివాస్, జుర్రు రాజు, బిజెపి పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్, రూరల్ అధ్యక్షులు తనుగుల అంబేడ్కర్,30 వార్డులో పోటీ చేసే అభ్యర్థులు, మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

