మన ప్రగతి న్యూస్ / చర్లపల్లి, మేడ్చల్ జిల్లా స్టాపర్ :
అతి వేగంగా, నిర్లక్ష్యంగా నడిపిన ద్విచక్ర వాహనం ఢీకొనడంతో పాన్‌షాప్ వ్యాపారి మృతి చెందిన ఘటన చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. మొహమ్మద్ గౌస్ పటేల్ తెలిపిన వివరాల ప్రకారం, అశోక్‌నగర్‌లో పాన్‌షాప్ నిర్వహిస్తున్న మొహమ్మద్ జాఫర్ (55) తన కుటుంబ సభ్యులతో కలిసి కుషాయిగూడ డీ-మార్ట్‌కు వెళ్లేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో తన పాన్‌షాప్ వద్ద మొబైల్ ఫోన్‌ను కుమారుడికి ఇచ్చి రోడ్డును దాటుతున్న సమయంలో, టి ఎస్ 08 యఫ్ వి 2242 నంబర్ గల పల్సర్ మోటార్‌సైకిల్‌ను అతి వేగంగా నడిపిన గుర్తుతెలియని వ్యక్తి ఆయనను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జాఫర్‌ను స్థానికులు వెంటనే ఈసీఐఎల్‌లోని జెనియా ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

