Breaking News

కేసిఆర్ కు సిట్ నోటీసులు పంపిన నేపథ్యంలో నిరసన

మన ప్రగతి న్యూస్/కరీంనగర్ జిల్లా స్థాపర్:

తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ ప్రజలకే నోటీసులు ఇచ్చినట్టు భావిస్తామన్నారు. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్,తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు పంపిన నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పిలుపుమేరకు బిఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షులు చల్ల హరిశంకర్ కరీంనగర్, మానకొండూర్ లో జీవీ రామకృష్ణ రావు ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ వద్ద నిరసన చేపట్టారు.ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలసి వారు రాస్తారోకో చేసి నిరసన వ్యక్తం చేస్తూ నోటీసులు పంపడాన్ని తీవ్రంగా ఖండించారు.రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగు సీరియల్ లాగా రోజుకో నోటీసులు రోజుకొకరికీ చొప్పున పంపిస్తూ కాలం వెలదీస్తూ పాలనను మర్చిపోయారని మండిపడ్డారు.కాంగ్రెస్ బిజేపి ప్రభుత్వాలు ఎప్పుడైతే అవినీతిలో కూరుకుపోతాయో అప్పుడే ఇలాంటి నోటీసులు విచారణల పేరిట ప్రజల దృష్టి మరల్చెందుకు నాటకానికి తెరదీస్తారు అన్నారు.ఒకసారి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో,మరోసారి సర్పంచ్ ఎన్నికల్లో,ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో ఇలా కేవలం ఎన్నికలప్పుడే నోటీసులు పంపడం తద్వారా బిఆర్ఎస్ పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండకుండా,డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అలవాటుగా మారిందన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర మంత్రులకు ఫోన్ టాపింగ్ లతో సంబంధం ఉండదని కేవలం రాష్ట్ర ప్రజల దృష్ట్యా ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ సంబంధించిన అధికారులు మాత్రమే ఫోన్ టాపింగ్ చేస్తారని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ టీంలో అప్పుడు ఇంటిలిజెన్స్ విభాగంలో పనిచేసిన అధికారులే ఉన్నారని మొదటగా వారికి నోటీసులు పంపాలని రేవంత్ రెడ్డికి సూచించారు.కేసీఆర్ మీద కక్ష సాధింపు ధోరణితోనే నోటీసులు పంపుతున్నారన్నారు.టిఆర్ఎస్ పార్టీ ఉవ్వెత్తున ఎగిస్తుందని ఇంటిలిజెంట్ ద్వారా సమాచారం తెచ్చుకొని నిర్వీర్యం చేయాలని ఉద్దేశంతోనే నోటీసులు విచారణల రోజుకో కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుందని మండిపడ్డారు.ప్రభుత్వాల అవినీతినీ ఎప్పటికప్పుడు బయటకు తీస్తామని హెచ్చరించారు.దేశ ప్రధానే కెసిఆర్ ను ఏం చేయలేకపోయారని,ఇక రేవంత్ రెడ్డి ఏం చేస్తారని విమర్శించారు.గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడును ఇలాగే ఇబ్బంది పెట్టాడని ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల్లో ఏవిధంగా తీర్పు ఇచ్చారో దారిని చూసైనా సిగ్గు తెచ్చుకోవాలని రేవంత్ రెడ్డికి సూచించారు.3 ఏళ్ల తరువాత రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 9 సీట్లే వస్తాయని జోష్యం చెప్పారు.తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆణిముత్యం బయటకు వస్తారన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు,బిఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షులు చల్లా హరిశంకర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్,మాజీ కార్పొరేటర్లు,బిఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు మాజీ ప్రజా ప్రతినిధులు,టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద కఠిన నిషేధాజ్ఞలు..