ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
మన ప్రగతి న్యూస్/ స్టేషన్ ఘన్‌పూర్ ప్రతినిధి::
ప్రత్యేక రాష్ట్ర సాధనతో తెలంగాణ ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును టచ్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. కెసిఆర్ కు సీట్ నోటీసులు జారీ చేసిన సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపట్టాలని పిలుపునిచ్చింది. ఆదివారం ఈ నేపథ్యంలో జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్, మరియు జఫర్గడ్ మండల కేంద్రంలో నిరసనలు, ర్యాలీలు నిర్వహించారు. టిఆర్ఎస్ శ్రేణులు ఈ సందర్భంగా జాతీయ రహదారులపై సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ నాటకం ఆడుతుందని అందులో భాగంగానే కెసిఆర్ కు సెట్ నోటీసులు అన్నారు. కెసిఆర్ దయవల్ల ఓటుకు నోటు కేసు నుండి తప్పించుకొని సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి కక్ష సాధింపు మానుకోవాలని ఆయన హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి వయసుకు గౌరవం ఇస్తున్నామని స్థాయి దిగజారి మాట్లాడితే ఆయన తల ఎక్కడ పెట్టుకుంటాడని ప్రశ్నించారు,. టిఆర్ఎస్ నుండి గెలిచానని చెప్పి కాంగ్రెస్ చుట్టూ తిరుగుతున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇప్పటికైనా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గౌరవాన్ని కాపాడుకోవాలని ఆయన కోరారు అనంతరం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధనంతో పాటు రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా కీర్తి దిద్దిన కెసిఆర్ పై కేసులు మోపడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటు అన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్ని జిమ్మిక్కులు వేసిన మున్సిపాలిటీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మాచర్ల గణేష్, ఆకుల కుమార్, మారపక రవి బాలరాజు , కుంభం కుమార్, తోపాటు జఫర్గడ్ మండలంలో మండల పార్టీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి,, ఉప సర్పంచ్ కొత్వాల కుమార్ తదితరులు పాల్గొన్నారు.,


