Breaking News

రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో ఎక్కడైన ఎమ్మెల్యే,ఎంపీగా పోటీకి సిద్ధం

-బిఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్

మన ప్రగతి న్యూస్/కరీంనగర్ జిల్లా స్థాపర్:

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద కఠిన నిషేధాజ్ఞలు..

సిరిసిల్ల టూ డోర్నకల్ వరకు ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని మాజీ ఎంపి వినోద్ కుమార్ అన్నారు.బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు వి రామకృష్ణ రావు క్యాంపు కార్యాలయంలో మీడియతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో ఎమ్మెల్యేగా గానీ, ఎంపీగా గానీ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని,తాను 50ఏళ్లుగా క్రియాశీల రాజకీయాల్లో సుదీర్ఘంగా ప్రజలకు సేవ చేస్తున్నాని ఎన్నికలప్పుడే రాజకీయం చేయను ఓడినా,గెలిచినా ప్రజల మధ్యలో వుంటూ రాజకీయాల్లో ఉంటానని, బిఆర్ఎస్ ప్రభుత్వం లో నేను ఏంపి గా ఉన్నప్పుడు,ప్రభుత్వం మానేరుపై తీగల వంతెన నిర్మాణం చేశామని ఇప్పటి ప్రభుత్వం వంతెనపై లైట్స్ వేసే పరిస్థితి లేదని తీగల వంతెన దయనీయంగా తయారైందని అన్నారు.కరీంనగర్ స్మార్ట్ సిటీని చేసే విషయంలో బీఆర్ఎస్ కృషి ముఖ్యంగా నేను మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ ను ఒప్పించి,మాజీ మంత్రి గంగుల కృషి తో తీగల వంతైన సాధించామని అన్నారు.మానకొండూర్ నియోజకవర్గంలో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇక్కడి ఎమ్మెల్యే చిన్న చిన్న రోడ్లను కూడా రిపేర్లు చేసే పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదని మండిపడ్డారు.జగిత్యాల టూ కోదాడ వరకు నేషనల్ హైవే రోడ్డు కుడా మా ప్రభుత్వం లో తీసుకొచ్చినాము.బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా,ప్రజా సమస్యలపై కోట్లాడుతాం.ఇంటిలిజెన్స్ అనేది ఒక వ్యవస్థ,దీని ద్వారా రాష్ట్రాన్ని ప్రజలను ప్రజలను కాపాడు కునేందుకు ఆ వ్యవస్థ అవసరమని వినోద్ అభిప్రాయపడ్డారు. కేసిఆర్ పై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దీనిని వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్,మాజీ ఎమ్మెల్సీ నరదాసు లక్ష్మణరావు,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు,మండల అధ్యక్షుడు శేఖర్ గౌడ్,పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.