మన ప్రగతి న్యూస్/టేక్మాల్
మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని వేల్పుగొండ గ్రామంలొ తుంబురీశ్వర స్వామి ఉత్సవాలలో భాగంగా అదివారం గ్రామ సర్పంచ్, నిరుడి దాస్, ఉప సర్పంచ్, ఎంపీ సుధాకర్, ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. కోబ్బరికాయ కుస్తీతో మొదలుకొని 5 తులాల వెండి కడేం కుస్తి వరకూ అంగరంగా వైనవంగ కుస్తీ పోటీలు జరిపారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన మల్లయోదులు కుస్తీ పట్టడం జరిగింది. ఈ కుస్తీ పోటీలకు మహారాష్ట్ర కర్ణాటక నాందేడ్ నిజామాబాద్ జహీరాబాద్ మెదక్ తో పాటు వివిధ ప్రాంతాల నుంచి మల్లాయోధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. చివరి కుస్తీ మహారాష్ట్ర డేగ్లూర్ కు చెందిన ఓంకార్ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం అంతపుర్ గ్రామానికి కు చెందిన గంగాధర్ మల్లయోధుల కుస్తీ హెూరా హెూరుగా కొనసాగింది. చివరకు అంతపురంకు చెందిన గంగాధర్ పైల్వాన్ కుస్తీ గెలుపొందాడు. గెలుపొందిన కుస్తీ పైల్వాన్ కు సర్పంచ్ నిరుడి దాస్, ఉప సర్పంచ్, ఎంపీ సుధాకర్ చేతుల మీదుగా పూల మాల వేసి 5 తులాల వెండి కడెం బహూకరించాడు. ఆనంతరం తుంబురీశ్వర స్వామి దర్శించుకుని దివెనలు తీసుకున్నారు. ఈకార్యక్రమంలో వార్డు మెంబర్లు శ్రీహరి, దేవసాయం, చత్రపతి శివాజీ యూత్ సభ్యులు, ప్రవీణ్ పటేల్, వెంకట్,గ్రామ పెద్దలు, రాఘవేంద్రర్, రాములు,నర్సింలు, కృష్ణ మూర్తి, రమేష్, రాజు, ముత్యం, మల్లేశం,శ్రీరాములు, రామకృష్ణ, వివిధ గ్రామాల ప్రజలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

