Breaking News

చేనేత ప్రవీణ్యాన్ని అభినందించిన రాష్ట్ర ఉన్నత న్యాయమూర్తి పి.శ్యామ్ కోషి

మన ప్రగతి న్యూస్/ రామన్నపేట:

జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, యదాద్రి భువనగిరి,రామన్నపేట నూతన కోర్టు భవనముల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్,తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయమూర్తులు
పి. శ్యామ్ కోషి రామన్నపేట మండలం బోగారంలో చేనేత మగ్గం, నేతలను సందర్శించి,న్యాయమూర్తి స్వయంగా మగ్గం నేసారు. చేనేతల కళా ప్రవీణ్యాన్ని అభినందించారు. వీరితో పాటు తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తులు జస్టిస్ కె.శరత్,జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ బి.విజయసేన రెడ్డి, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి, జస్టిస్ కె.సుజన, జస్టిస్ నర్సింగరావు నందికొండ, రామన్నపేట న్యాయమూర్తులు మరియు యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.జయరాజు తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద కఠిన నిషేధాజ్ఞలు..